సైబర్ కేటుగాళ్లు రోజు రోజుకూ రెచ్చిపోతున్నారు. అమాయకులను టార్గెట్‌గా చేసుకోని మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులో ఇద్దరు ప్రైవేటు ఉద్యోగులను మోసం చేశారు. వారి వద్ద నుంచి రూ.3.81 కోట్లు దోచేశారు. దీంతో మోసపోయిన బాధితులు పోలీసులను ఆశ్రయించారు.