తెలంగాణ డైనమిక్ ఐఏఎస్ స్మితా సబర్వాల్.. దివ్యాంగుల రిజర్వేషన్లపై చేసిన కామెంట్ల దుమారం ఇంకా చల్లారలేదు. అప్పుడే అటు నెట్టింట.. ఇటు బయటా తీవ్రస్థాయిలో వ్యతిరేకత రాగా.. రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగులు రోడ్డుపైకి వచ్చి తమ నిరసన వ్యక్తం చేశారు. కాగా.. ఇప్పుడు ఏకంగా కేంద్రానికే కంప్లైంట్ చేశారు. ఢిల్లీలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్‌కు అఖిల భారత వికలాంగుల హక్కుల వేదిక అధ్యక్షుడు కొల్లి నాగేశ్వర రావు ఫిర్యాదు చేశారు.