Smita Sabharwal Ideathon: నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే స్మితా సబర్వాల్.. తన వ్యక్తిగత ఫొటోలు, తమ అభిప్రాయాలు పంచుకోవటమే కాకుండా.. నెటిజన్ల నుంచి కూడా అభిప్రాయాలు అడిగి తెలుసుకుంటుంటారు. ఈ క్రమంలోనే.. ఆసక్తికరమైన పోస్ట్ పెట్టారు. ఈసారి పోస్ట్.. పర్సనల్ అభిప్రాయాలు కాకుండా.. ప్రొఫెషనల్ ఐడియాల గురించి. అదిరిపోయే ఐడియా ఇవ్వండి.. లక్ష గెలుచుకోండి.. అంటూ బంపర్ ఆఫర్ ప్రకటించారు స్మితా సబర్వాల్.