స్వయంభూ శంభుని ఆలయంలో పట్టపగలే ఇలా.. సీసీ కెమెరాల్లో మొత్తం రికార్డు..

2 months ago 5
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని హైమది బజార్ ప్రాంతంలో గల స్వయంభూ శంభుని ఆలయంలో బుధవారం పట్టపగలే చోరీ జరిగింది. ఒక దుండగుడు ఆలయ గోడ దూకి లోపలికి ప్రవేశించి.. వెండి హారతి పల్లాలు, శత గోపురం, ఇత్తడి , పంచలోహ పూజా సామగ్రిని ఎత్తుకెళ్లాడు. సాయంత్రం పూజకు వచ్చిన అర్చకుడు రాజ్ కిరణ్ ఈ విషయాన్ని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆలయ సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేయగా... దొంగిలించిన వస్తువులను ఒక పాత సామాన్ల వ్యాపారికి కేవలం రూ. 200లకే విక్రయించినట్లు తేలింది. రెండో టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలిస్తున్నారు.
Read Entire Article