వేసవి సెలవుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే జూన్‌లో 150 రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది. దీనిలో భాగంగానే సికింద్రాబాద్ - కాకినాడ టౌన్ మధ్య 16 ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. జూన్ 12 నుండి ఆగష్టు 1 వరకు ఈ రైళ్లు అందుబాటులో ఉంటాయి. అంతేకాకుండా, ప్రయాణికుల సౌకర్యార్థం చర్లపల్లి నుండి విశాఖపట్నంకు మరిన్ని ప్రత్యేక రైళ్లను నడపనున్నారు. ప్రయాణికులు రైల్వే వెబ్‌సైట్ లేదా యాప్ ద్వారా టికెట్లను బుక్ చేసుకోవచ్చు.