ప్రజాస్వామ్యంలో హింసకు తావు లేదని.. కార్యకర్తలకు తమ పార్టీ అండగా ఉంటుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి తమ్ముడు కొండల్ రెడ్డి అనుచరులతో తమ కుటుంబానికి ప్రాణ హానీ ఉందని ఓ పార్టీ నాయకుడు చేసిన ట్వీట్‌కు కేటీఆర్ రిప్లయ్ ఇచ్చారు. వారి భద్రతకు తాను హామీ ఇస్తున్నట్లు చెప్పారు.