యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయం కేంద్రంగా తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి. రైతు రుణమాఫీ అమలు అంశం ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్‌గా మారింది. ఓవైపు.. బీఆర్ఎస్ నేతలు క్షేత్రస్థాయిలో ఆందోళనలకు దిగగా.. మరోవైపు ఇప్పటికే ప్రకటించినట్టుగా హరీష్ రావు పాప ప్రక్షాళనలు చేయటం మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే.. యాదాద్రిలో హరీష్ రావు చేసిన పూజలపై ఆలయ ఈవో భాస్కర్ రావు.. పోలీస్ కంప్లైంట్ చేశారు.