చంద్రబాబు సర్కార్‌పై వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇచ్చిన హామీలు అమలు చేయలేమని సాకులు వెతుక్కుంటున్నారని ఆరోపించారు. వైసీపీ అధికారంలోకి వచ్చే సమయానికి 5 లక్షల కోట్ల అప్పులు, బడ్జెట్‌లో 100 కోట్లు మాత్రమే ఉన్నాయన్నారు. కానీ జగన్ మాత్రం ఇచ్చిన హామీలన్నీ అమలు చేశారని చేశారని గుర్తు చేశారు. కొవిడ్‌తో రాబడి తగ్గినా హామీలు అమలు చేసి చూపించామన్నారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక హామీల అమలు చెయ్యలేనని చెప్పడం దారుణమన్నారు. జగన్ పాలనకు-చంద్రబాబు పాలనకు తేడాను గమనించాలని ప్రజలను కోరారు.