జనసేన జయకేతనం సభలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హిందీ భాష అమలుపై కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. తమిళనాడు ప్రభుత్వం టార్గెట్‌గా పవన్ కళ్యాణ్ విమర్శలు గుప్పించారు. దీనికి డీఎంకే నేతల నుంచి, ఇటు సినీ నటుడు ప్రకాష్ రాజ్ నుంచి కౌంటర్లు వచ్చాయి. ఈ నేపథ్యంలో హిందీ భాష అమలుపై పవన్ కళ్యాణ్ ఎక్స్ వేదికగా స్పందించారు. గతంలో హిందీకి వ్యతిరేకంగా మాట్లాడిన పవన్.. ఇప్పుడు ఎందుకు మాట మార్చారంటూ వైసీపీ విమర్శిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ విమర్శలకు పవన్ కళ్యాణ్ తన ట్వీట్ ద్వారా క్లారిటీ ఇచ్చారు.