హిందూపురం మున్సిపల్ ఛైర్మన్ పదవి తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది. మున్సిపల్ ఛైర్మన్‌గా ఆరవ వార్డు కౌన్సిలర్ రమేష్ కుమార్ ఎన్నికయ్యారు. అనంతరం టీడీపీ నేతలు, కార్పొరేటర్లు, కార్యకర్తలు బాణా సంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. హిందూపురం మున్సిపాల్టీలో మొత్తం 38 వార్డులు ఉంటే.. 21 మంది కౌన్సిలర్లుతో పాటు ఎంపీ, ఎమ్మెల్యే మద్దతుతో చైర్మెన్‌గా రమేష్ కుమార్ ఎన్నికయ్యారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థికి 14 ఓట్లు రాగా.. ముగ్గురు ఎన్నికకు హాజరుకాలేదు.