మరో రెండు నెలలైతే ఆ కుటుంబంలో ఎన్నో ఆనందాలు వెల్లివిరిసేవి. ఆ తల్లి మాతృత్వంతో ఉప్పొంగిపోయేది. ఎప్పుడెప్పుడు తన బొజ్జలోని బుజ్జాయిని తన చేతుల్లోకి తీసుకుని ముద్దాడదామా అని ఏడు నెలలుగా ఎదురుచూస్తోన్న ఆ తల్లి కలలు క్షణంలో కల్లలైపోయాయి. లారీ రూపంలో దూసుకొచ్చిన మృత్యువు.. ఏడు నెలల గర్భిణినే కాదు.. తన కడుపులో ఉన్న శిశువును కూడా బలితీసుకుంది. మెదక్ జిల్లా మనోహరాబాద్ జాతీయ రహదారిపై జరిగిన ఈ ప్రమాదం.. ఆ కుటుంబాసభ్యుల గుండెల్నే కాదు.. చాలా మంది హృదయాలను కలచివేసింది.