తెలంగాణ రాజకీయాల్లో అగ్గిరాజేయటమే కాకుండా సమాజమంతా మాట్లాడుకునేలా చేసిన కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూముల వివాదంపై సీఎం రేవంత్ రెడ్డి మరోసారి సంచలన కామెంట్లు చేశారు. ఈ భూముల విషయంలో కోర్టులో ఉన్న కేసులపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించారు. ఈ సందర్భంగా.. ఏఐ ద్వారా సృష్టించిన ఫేక్ వీడియోలు, ఫొటోలు సృష్టించిన వివాదంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఫేక్ కంటెంట్ ఇలాగే వ్యాప్తి చెందితే భవిష్యత్తులో ఇక యుద్ధాలు జరగటం ఖాయమని రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు.