హైకోర్టులో మోహన్ బాబుకు చుక్కెదురైంది. మంచు వారి ఫ్యామిలీ ఫైట్‌లో భాగంగా.. మోహన్ బాబు ఓ మీడియా ప్రతినిధిపై దాడి చేయగా.. ఈ ఘటనలో మోహన్ బాబుపై పోలీసులు పలు సెక్షన్లపై కేసు నమోదు చేశారు. ఈ క్రమంలోనే.. హత్యాయత్నం కేసు కూడా నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే.. ముందస్తు బెయిల్ కోసం మోహన్ బాబు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. విచారణ చేసిన ధర్మాసనం మధ్యంతర బెయిల్‌ను నిరాకరించింది.