కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో రైల్వేల అభివృద్ధికి కట్టుబడి ఉంది. దీనిలో భాగంగా తాజాగా సెంట్రల్ గవర్నమెంట్.. హైదరాబాద్‌లోని హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ అభివృద్ధికి అమృత్ భారత్ పథకం కింద రూ.25.95 కోట్లు కేటాయించింది. ఇప్పటికే ఈ స్టేషన్‌లో 80 శాతం పనులు పూర్తయ్యాయని, ప్రయాణికుల కోసం మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. దివ్యాంగుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశామని చెప్పుకొచ్చారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు.