హైదరాబాద్‌లో బుల్డోజర్ల మోత అక్రమార్కుల గుండెల్లో గునపం దింపుతోంది. ప్రస్తుతం హైడ్రా చేపట్టిన కూల్చివేతలు.. కేవలం హైదరాబాద్‌లోనే కాదు.. పక్క రాష్ట్రాల్లోనూ చర్చనీయాంశంగా మారాయి. ఈ క్రమంలోనే.. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌కు భద్రత పెంచింది. రంగనాథ్ ఇంటి దగ్గర ఇద్దరు సెక్యూరిటీతో కూడిన ఔట్ పోస్టు ఏర్పాటు చేశారు. రాజకీయ, సినీ ప్రముఖుల నుంచి ఏదైనా ముప్పు వాటిళ్లుతుంతుందన్న అనుమానంతో భద్రతను పెంచారు.