హైడ్రా కమిషనర్ రంగనాథ్ మరోసారి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. అయితే.. ఈసారి లాయర్‌కో, అక్రమంగా నిర్మాణాలు చేపటుడుతున్న అక్రమార్కులకో కాదు.. అమాయకుల నుంచి అన్యాయంగా డబ్బులు దండుకుంటూ కొత్త దందాలకు తెరలేపిన దుండగులకు గట్టి వార్నింగే ఇచ్చారు. అమీన్ పూర్ చెరువు ముంపు బాధితుల జేఏసీ పేరుతో దందాలకు పాల్పడుతున్నారని పెద్ద ఎత్తున వస్తున్న ఫిర్యాదులపై తీవ్రంగా స్పందించిన రంగనాథ్.. ఈ మేరకు హెచ్చరికలు జారీ చేశారు.