ఓ వైపు హైడ్రా అధికారులు చెరువుల ఎఫ్‌టీఎల్, బఫర్‌జోన్లలో నిర్మించిన అక్రమ కట్టడాలను కూల్చేస్తుంటే.. జీహెచ్ఎంసీ అధికారులు సైతం కూల్చివేతలు ప్రారంభించారు. నగరంలో ఎటువంటి పర్మిషన్ లేకుండా నిర్మించి అదనపు అంతస్తులను కూల్చుతున్నారు. తాజాగా మెహదీపట్నంలో మూడు ఫ్లోర్లకు పర్మిషన్ తీసుకొని ఆరు ఫ్లోర్లు నిర్మించగా.. ఆ అదనపు ఫ్లోర్లు కూల్చేశారు.