హైదరాబాద్ నగర పరిధిలో ఉన్న చెరువులు, కుంటలు, ప్రభుత్వ భూముల పరిరక్షణే లక్ష్యంగా రంగంలోకి దిగిన హైడ్రా.. ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకుంది. నగరంలో చెరువులు పరిరక్షణపై లేక ప్రొటెక్షన్ కమిటీ సమావేశం నిర్వహించగా.. ఇందులో కీలక అంశాలపై చర్చించారు. అయితే.. చెరువుల ఆక్రమణల గురించిన సమాచారం క్షణాల్లో హైడ్రాకు చేరేలా ఫీచర్స్, అధికారుల పర్యవేక్షణ వివరాలు, ఆక్రమణలపై తీసుకున్న చర్యలకు సంబంధించిన సమాచారం యాప్‌లో ఉండేలా రూపొందిస్తున్నట్టు సమాచారం.