ఎఫ్‌టీఎల్, బఫర్‌జోన్‌లో ఆక్రమల కూల్చివేతల విషయంలో హైడ్రా దూకుడుకు అక్రమార్కులు వెన్నులో వణుకుపుడుతోంది. ఎప్పుడు ఎవరి భవనం ముందు బుల్డోజర్లు వస్తాయోనని షేకవుతున్నారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఎన్ని ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లలో ఉన్న నిర్మాణాలు ఎవరివైనా సరే కూల్చివేస్తామని ఆయన తేల్చిచెప్పారు. 30 ఏళ్ల కిందట నిర్మించిన కట్టడాలైనా ఆక్రమణల్లో ఉన్నాయని తేలితే చర్యలు తప్పవన్నారు.