హైదరాబాద్‌లో కేవలం డిఫెన్స్, రాజకీయ ప్రముఖుల, ప్రైవేటు విమానాల రాకపోకలకు మాత్రమే పరిమితమైన బేగంపేట విమానాశ్రయాన్ని మరోసారి పూర్తిగా అందుబాటులోకి తీసుకురావాలని కేంద్రం యోచిస్తోంది. ఈ మేరకు కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కీలక ప్రకటన చేశారు. బేగంపేట నుంచి డొమెస్టిక్ విమానాల రాకపోకలను ప్రారంభించాలని భావిస్తున్నట్టు రామ్మోహన్ నాయుడు తెలిపారు. మరి ఈ నిర్ణయం ఆచరణాత్మకంగా మారుతుందా లేదా అన్నది చూడాలి.