ప్రైవేటు హాస్టల్స్ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని హైదరాబాద్ ఎస్సార్‌నగర్ EWS కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు హాస్టళ్ల ఏర్పాటును వ్యతిరేకిస్తూ కాలనీ వాసులు పలు కూడళ్లలో బ్యానర్లు ఏర్పాటు చేశారు. తమ కాలనీలో హాస్టల్స్ కారణంగా రోడ్లపై పెద్ద ఎత్తున యువత చేరుతున్నారని.. ఎక్కడపడితే అక్కడ వాహనాలు పార్క్ చేస్తున్నారని వాపోతున్నారు.