తెలంగాణకు పెట్టుబడులు తీసుకురావటమే లక్ష్యంగా అమెరికా పర్యటనకు వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి బృందం పలు ప్రముఖ కంపెనీలతో భేటీ అవుతోంది. ఈ క్రమంలో హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టేందుకు కంపెనీలు క్యూ కడుతున్నాయి. ట్రైజిన్ టెక్నాలజీస్ కంపెనీ హైదరాబాద్‌లో తమ అర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ సెంటర్ నెలకొల్పనున్నట్టు ప్రకటించగా... అసెట్ మేనేజ్‌మెంట్ టెక్నాలజీ సర్వీసెస్, అడ్వాన్స్‌డ్ డేటా ఆపరేషన్స్‌లో ప్రముఖ కంపెనీ ఆర్సీజియం హైదరాబాద్‌లోని తమ కంపెనీని విస్తరించడానికి అంగీకరించింది.