హైదరాబాద్‌కు శత్రు క్షిపణుల నుంచి రక్షణ కల్పించే విధంగా కేంద్రం చర్యలు తీసుకుంటోంది. ‘ఖండాంతర క్షిపణి రక్షణ’ (BMD) వ్యవస్థను హైదరాబాద్‌కు కూడా విస్తరించాలని ప్రభుత్వం యోచిస్తోంది. పాకిస్థాన్‌తో యుద్ధం నేపథ్యంలో ఈ అంశంపై కసరత్తు చేస్తున్నారు. హైదరాబాద్‌లో డీఆర్‌డీవో, రక్షణ పరిశోధన సంస్థలు, ఆయుధ తయారీ కేంద్రాలు ఉన్నాయి. ప్రైవేటు డిఫెన్స్, ఏరోస్పేస్ పరిశ్రమలకు కూడా హైదరాబాద్ కేంద్రంగా మారుతోంది. ఢిల్లీ, ముంబైలకు ఇప్పటికే ఈ బీఎండీ వ్యవస్థ ఉంది. దక్షిణాదిలో బెంగళూరు, చెన్నైలకు కూడా విస్తరించే అవకాశం ఉంది. ఇది నగర రక్షణను మరింత బలోపేతం చేస్తుంది.