హైదరాబాద్లో నీటి కొరత రాకుండా ఉండేందుకు జలమండలి ప్రత్యామ్నాయ నీటి సరఫరా వ్యవస్థను సిద్ధం చేస్తోంది. నవంబర్ 1 నుంచి ‘డయల్-ఏ-గ్రీన్ ట్యాంకర్’ సేవలను ప్రారంభించాలని ప్రణాళిక రూపొందించింది. నిర్మాణ పనులు, పరిశ్రమలు, పార్కులు, పచ్చదనం నిర్వహణకు తాగునీటిని ఉపయోగించకుండా శుద్ధి చేసిన మురుగునీటిని వినియోగించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. తొలి దశలో రోజుకు 100 ఎంఎల్డీ శుద్ధి చేసిన నీటి వినియోగాన్ని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటికే 51 ప్రైవేట్ ఎస్టీపీలను నమోదు చేసి, వాటి నుంచి రోజుకు సుమారు 1.5 ఎంఎల్డీ మిగులు నీరు లభిస్తున్నట్లు గుర్తించారు.