హైదరాబాద్‌కు బుల్లెట్ రైలు.. సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..

5 months ago 8
తెలంగాణలో రవాణా, అభివృద్ధి కార్యక్రమాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొన్ని కీలక ప్రకటనలు చేశారు. త్వరలో హైదరాబాద్ నగరంలో మూడు వేల ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెడతామని ఆయన తెలిపారు. ఈ కొత్త బస్సులు అందుబాటులోకి వచ్చాక, ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్న బస్సులను గ్రామాలకు తరలించి ప్రజారవాణాను మెరుగుపరుస్తామని వివరించారు. రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాల్లో తెలంగాణ మొదటి స్థానంలో ఉందని చెప్పారు. అలాగే.. హైదరాబాద్, బెంగళూరు మధ్య బుల్లెట్ రైలు ఏర్పాటు చేస్తామని, ఔటర్ రింగ్ రోడ్డుకు అనుబంధంగా రీజినల్ రింగ్ రోడ్డు (RRR)ను అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఫార్మా, ఇతర రంగాలకు రోడ్‌మ్యాప్‌లు సిద్ధం చేస్తున్నామని చెప్పారు.
Read Entire Article