తెలంగాణ ప్రభుత్వం 2026-27 ఆర్థిక సంవత్సరానికి రూ.3,24,234 కోట్లతో బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. పరిశ్రమలకు రూ.3,490 కోట్లు, ఐటీ శాఖకు రూ.875 కోట్లు కేటాయించింది. గూగుల్ సేఫ్టీ ఇంజినీరింగ్ సెంటర్ ఏర్పాటు, టి-ఫైబర్ విస్తరణ, కొడంగల్ పారిశ్రామికాభివృద్ధి, జహీరాబాద్ స్మార్ట్ సిటీ ప్రాజెక్టులకు ప్రాధాన్యతనిచ్చింది. ఐటీ ఎగుమతులు రూ.3.13 లక్షల కోట్లకు చేరడం రాష్ట్ర ప్రగతికి నిదర్శనమని ప్రభుత్వం పేర్కొంది.