హైదరాబాద్ నగరంలో గణేష్ నిమజ్జన శోభాయాత్ర సందర్భంగా పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. నేటి ఉదయం 6 గంటల నుంచి సెప్టెంబర్ 7 ఉదయం 10 గంటల వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయి. శోభాయాత్ర మార్గాల్లో ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయి. లక్షలాది మంది భక్తులు పాల్గొనే ఈ వేడుకకు విస్తృతమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ప్రయాణికులు గూగుల్ మ్యాప్స్ ద్వారా తమ ప్రయాణ మార్గాలను తెలుసుకోవాలని పోలీసులు సూచించారు.