హైదరాబాద్ నగరవాసులకు గుడ్‌న్యూస్. డబుల్‌డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్లపై కీలక అప్డేట్ వచ్చింది. త్వరలోనే కారిడార్ల నిర్మాణం పనులు ప్రారంభం కానున్నాయి. ప్యారడైజ్ జంక్షన్ నుంచి శామీర్‌పేట వరకు, ప్యారడైజ్ నుంచి డెయిరీఫాం వరకు వీటిని నిర్మిస్తుండగా.. భూసేకరణకు అడ్డు తొలగనుంది. త్వరలోనే బాధితులకు పరిహారం ఇచ్చి పనులు ప్రారంభించేందుకు హెచ్‌ఎండీఏ సిద్ధమవుతోంది.