Hyderabad Weather Update: హైదరాబాద్ నగరాన్ని వరుణుడు వణికిస్తున్నాడు. మేఘం విరిగిపడిందా అన్నట్టుగా.. గ్యాప్ ఇచ్చి మరీ దండి కొడుతున్నాడు. వరుణుడి ప్రతాపాని నగరం వణికిపోతోంది. భారీ వర్షాలతో నగరంలోని రోడ్లన్ని నదులను తలపిస్తున్నాయి. సరిగ్గా ఆఫీసులు వదిలే సమయానికి వర్షం దంచి కొట్టటంతో.. రోడ్లు మొత్తం ట్రాఫిక్ జామ్‌తో నిండిపోయాయి. మరో వారం రోజులు కూడా ఇదే పరిస్థితులు ఉండనున్నాయంటూ వాతావరణ శాఖ కూడా హెచ్చరించింది.