హైదరాబాద్ పాతబస్తీ టప్పాచబుత్రా జిర్ర హనుమాన్ ఆలయంలో అపచారం జరిగింది. ఆలయంలోని శివలింగం వెనుక గుర్తు తెలియని దుండగులు మాంసం పడేశారు. మాంసం చూసి కంగుతిన్న భక్తులు.. పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆలయ పరిసరాలను పరిశీలించారు. అటు హనుమాన్ ఆలయం వద్దకు హిందూ సంఘాలు భారీగా చేరుకుంటున్నారు. మాంసం పడేసింది ఎవరో గుర్తించి.. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.