Arrest of cyber criminals at fake call center in Hyderabad: హైదరాబాద్‌లో సైబర్ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో, బాచుపల్లిలో నకిలీ కాల్ సెంటర్ గుట్టు రట్టయింది. పోలీసులు దాడి చేసి తొమ్మిది మంది ముఠా సభ్యులను అరెస్ట్ చేశారు, వారి వద్ద నుండి ల్యాప్‌టాప్‌లు, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠా క్రెడిట్ కార్డులు, డిజిటల్ చెల్లింపుల పేరుతో భారతీయులతో పాటు అమెరికన్లను మోసం చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.