టీటీడీకి మరోసారి భారీ విరాళం అందింది. హైదరాబాద్‌కు చెందిన తాండవ కృష్ణమూర్తి అనే భక్తుడు టీటీడీ ఆధ్వర్యంలోని ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళంగా అందించారు. టీటీడీ ఏఈవోను కలిసి విరాళానికి సంబంధించిన చెక్కును అందించారు. ఈ సందర్భంగా టీటీడీ ఏఈవో వెంకయ్య చౌదరి భక్తుడిని అభినందించారు. మరోవైపు తిరుమల సాలకట్ల తెప్పోత్సవాలు ఫిబ్రవరి 26వ తేదీ నుంచి జరగనున్నాయి. ఈ మేరకు టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది.