మెట్రో ప్రయాణికులకు హైదరాబాద్ మెట్రో యాజమాన్యం గుడ్ న్యూస్ వినిపించింది. ఇప్పటికే.. అందుబాటులో ఉన్న పలు జనాధరణ పొందిన ఆఫర్ల గడువును పొడిగిస్తూ.. కీలక నిర్ణయం తీసుకుంది. సూపర్ సేవర్ కార్డు ఆఫర్, స్టూడెంట్ పాస్ ఆపర్‌తో పాటు సూపర్ సేవర్ ఆఫర్- పీక్ ఆవర్ ఆఫర్ల గడువును మరింత పొడిగిస్తూ.. కీలక నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా.. సురక్షితమైన, సౌకర్యవంతమైన పార్కింగ్ సౌకర్యాలను కూడా అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు యాజమాన్యం ప్రకటించింది.