హైదరాబాద్ మెట్రో విస్తరణపై బిగ్ అప్డేట్. ప్రస్తుతం చేపట్టిన మెట్రో రెండో దశలో భాగంగా.. ఎయిర్ పోర్ట్ మెట్రో లైన్‌ను ఫ్యూచర్ సిటీ వరకు విస్తరించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఈ విస్తరణకు అవసరమైన తుది ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. నగరంలో మెట్రో విస్తరణపై కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షించారు. మెట్రో రెండో దశ విస్తరణకు సంబంధించిన ప్రతిపాదనల పురోగతిని సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారు.