హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశ నిర్మాణానికి వడి వడిగా అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే.. అధికారులు రూట్ మ్యాప్ ఫైనల్ చేసి.. డీపీఆర్ సిద్ధం చేసింది. ఇక అధికారులు రంగంలోకి దిగి నిర్మాణానికి మార్గం సుగమం సిద్ధం చేసే పనిలో పడ్డారు. ఈ క్రమంలో.. తెరపైకి ఇంట్రెస్టింగ్ టాపిక్ తెరపైకి వచ్చింది. గతం ప్రభుత్వం ఫైనల్ చేసి ప్రతిపాదనలు సిద్ధం చేసిన ప్యారడైజ్ నుంచి మేడ్చల్ మార్గంలోని డబుల్ డెక్కర్ మెట్రో కారిడార్ గురించి ఈ సెంకడ్ ఫేజ్‌లో కనీసం ప్రస్తావించకపోవటం గమనార్హం.