జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మికి మరో షాక్ తగిలింగి. ఇప్పటికే.. ఆమెపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు బీఆర్ఎస్ పావులు కదువుతున్న నేపథ్యంలో.. మరో భారీ షాక్ తగిలింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జీవో నెంబర్ 56 ద్వారా కేటాయించిన భూముల క్రమబద్దీకరణపై హైకోర్టులో పిల్ దాఖలైంది. ఆ జీవోను రద్దు చేసి.. ఆ స్థలాలను సర్కార్ వెనక్కి తీసుకోవాలని పిటిషన్ కోరారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. తర్వాతి విచారణను ఫిబ్రవరి 27కు వాయిదా వేసింది.