హైదరాబాద్‌కు చెందిన మిథాలీ అగర్వాల్ జాతీయ స్థాయిలో అరుదైన గుర్తింపు పొందారు. జైపూర్‌లో నిర్వహించిన మిసెస్ ఇండియా 2025 పోటీల్లో ఆమె రెండు ప్రతిష్ఠాత్మక బిరుదులు గెలుచుకున్నారు. ఆమెకు 'మిసెస్ ఇండియా 2025 గ్లోబల్ అంబాసిడర్' మరియు 'మిసెస్ ఇండియా కన్జీనియాలిటీ' పురస్కారాలు లభించాయి. ఇంజినీరింగ్ నేపథ్యం ఉన్న మిథాలీ, గతంలో ఐఐటీ హైదరాబాద్‌లో ప్రజా సంబంధాల అధికారిగా పనిచేశారు. ప్రస్తుతం ఆమె 'ఎకోమిట్జ్' సంస్థ ద్వారా పర్యావరణ పరిరక్షణకు.. 'ప్యాడ్ కేర్' ద్వారా మహిళల ఆరోగ్య చైతన్యానికి కృషి చేస్తున్నారు. అందంతో పాటు సామాజిక బాధ్యతను చాటుతున్న మిథాలీని పలువురు అభినందిస్తున్నారు.