తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రీజినల్ రింగ్ రోడ్డు ప్రాజెక్టుకు హెచ్‌ఎండీఏ ప్రాథమిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎనిమిది జిల్లాల మీదుగా వంద మీటర్ల వెడల్పుతో నిర్మించనున్న ఈ రోడ్డు అలైన్‌మెంట్‌కు సంబంధించిన వివరాలను వెల్లడించింది. ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరించి, తుది నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రాజెక్టుతో ఆయా ప్రాంతాల్లో భూముల విలువ పెరగడంతో పాటు రవాణా సౌకర్యాలు మెరుగుపడతాయని భావిస్తున్నారు.