హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు నిర్మాణంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. రీజినల్ రింగు రోడ్డు నిర్మాణానికి సంబంధించిన.. భూముల సేకరణ, పరిహారం, అభివృద్ధి, నిర్మాణం లాంటి అంశాలపై.. వివిధ శాఖల అధికారులతో ఒక ఉన్నత స్థాయి కమిటీ వేసి.. లోతైన అధ్యయం చేపించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలోనే.. ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగాన్ని రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా నిర్మిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన కూడా చేస్తున్నట్టు సమాచారం.