తెలంగాణ అభివృద్దిలో కీలకమైన రీజినల్ రింగు రోడ్డు నిర్మాణంపై కేంద్రమంత్రి గడ్కరీ కీలక ప్రకటన చేశారు. పార్లమెంట్‌లో తెలంగాణ బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ అడిగిన ప్రశ్నకు బదులిచ్చిన ఆయన.. భూ సేకరణ పూర్తయిన తర్వాత ప్రాజెక్టును పట్టాలెక్కిస్తామన్నారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వమే భూసేకరణ చేపడుతుందని చెప్పారు.