హైదరాబాద్‌లో అబ్బురపరిచేలా ఎయిర్‌ షో.. అదిరిపోయిందంతే..!

1 month ago 7
హైదరాబాద్ నడిబొడ్డున హుస్సేన్‌సాగర్ గగనతలంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ #IAF విన్యాసాలను ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి పలువురు మంత్రులతో కలిసి వీక్షించారు. ప్రజా పాలన – ప్రజా విజయోత్సవాల్లో భాగంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన సూర్యకిరణ్ ఎరోబాటిక్ టీమ్ అద్భుతమైన విన్యాసాలను ప్రదర్శించింది. తొమ్మిది జెట్ విమానాలతో నిర్వహించిన విన్యాసాలు సర్వత్రా నగర ప్రజలను అలరించాయి. ట్యాంక్‌బండ్ నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఇతర మంత్రులు, ప్రజా ప్రతినిధులు ఈ విన్యాసాలను వీక్షించగా, ట్యాంక్‌బండ్‌తో పాటు నెక్లెస్ రోడ్డు మార్గం, పరిసర ప్రాంతాల నుంచి అశేష ప్రజానీకం ఈ అద్భుత కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా వీక్షించారు.
Read Entire Article