హైదరాబాద్ వాసులకు మరో అలర్ట్. ప్రైమ్ టైంలో నగరంలోని రోడ్లపై భారీ వాహనాలు తిరగటం వల్ల ట్రాఫిక్‌కు తీవ్ర స్థాయిలో అంతరాయం కలుగుతోందని.. ప్రమాదాలు కూడా జరుగుతున్నాయంటూ వార్తలు రావటంతో.. పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. నగరంలోకి భారీ వాహనాల ఎంట్రీపై హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. ఉదయం 7 దాటిందంటే.. నగరంలోకి భారీ వాహనాలకు నో ఎంట్రీ అని సీపీ ప్రకటించారు.