ప్రభుత్వ స్థలంలో నిర్మించిన చాలా వరకు నిర్మాణాలు హైడ్రా వచ్చిన తర్వాత ఒక్కోటి బయటకు వస్తున్నాయి. కొంత మంది అక్రమ కట్టాలు విషయంలో ఫిర్యాదు చేసేందుకు హైడ్రా దాక వెల్లకుండా.. ఆ పరిధి రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేస్తున్నారు. అక్కడ నిజంగానే అక్రమ కట్టడం జరిగిందా లేదా అనేది అధికారులు నిర్ధారించుకొని వాటిని కూల్చేస్తున్నారు. ప్రభుత్వ స్థలంలో ఏ నిర్మాణాలు చేపట్టవద్దని ప్రభుత్వం చెబుతున్నా.. చాలా మంది పెడచెవిన పెడుతున్నారు. ఈ కోవలోకే వస్తుంది ఈ ఘటన. హైదరాబాద్ లో ఫేమస్ ఫంక్షన్ హాల్ ను రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.