ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లుగా హైదరాబాద్ అంతటా కుండపోత వర్షం కురుస్తోంది. అర్ధరాత్రి తర్వాత మెుదలైన వాన ఇంకా కురుస్తూనే ఉంది. దీంతో నగరంలోని రోడ్లన్నీ జలమయమయ్యాయి. మరికొన్ని గంటల పాటు సిటీలో వర్షం కురిసే ఛాన్స్ ఉందన్నారు. ఇక ద్రోణి ప్రభావంతో తెలంగాణ అంతటా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు.