హైదరాబాద్ నగరంలో కొత్తగా మరో మూడు బస్టాండ్లు నిర్మించేందుకు ఆర్టీసీ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఎంజీబీఎస్ బస్టాండ్‌పై ఒత్తిడి తగ్గించటంతో పాటుగా.. జిల్లాల నుంచి వచ్చే ప్రయాణికుల సౌలభ్యం కోసం ఆరాంఘర్, ఉప్పల్, ఎల్బీనగర్ ప్రాంతాల్లో అత్యాధునిక హంగులతో ఈ బస్టాండ్లు నిర్మించాలని భావిస్తున్నారు. త్వరలోనే స్థలాల పరిశీలన పూర్తి చేసి నిర్మాణానికి సిద్ధం అవుతున్నట్లు తెలిసింది.