హైదరాబాద్ నగరంలో కొత్తగా నిర్మాణాలు చేపట్టే వారికి అలర్ట్. నిర్మాణాలు చేపట్టాలంటే హెచ్ఎండీఏ నుంచి ఎన్వోసీ తీసుకోవాల్సిందే. గతంలో బఫర్ జోన్ పరిధికి దగ్గర్లోని నిర్మాణాలపై చూసీ చూడనట్లు వ్యవహరించే అధికారులు ఇక నుంచి పక్కాగా పరిశీలించిన తర్వాతే అనుమతులు ఇవ్వనున్నారు.