హైదరాబాద్ కూకట్‌పల్లిలో చైనా మాంజా ఓ చిన్నారి ప్రాణాన్ని బలితీసుకుంది. అంబేడ్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేటకు చెందిన రామసాగర్ తన ఐదేళ్ల కుమార్తె నిష్వికతో కలిసి బైక్‌పై వెళ్తుండగా.. వివేకానంద నగర్ వద్ద గాలిలో వేలాడుతున్న పతంగి దారం పాప గొంతుకు చుట్టుకుంది. గ్లాస్ కోటింగ్ ఉన్న ఆ దారం కత్తిలా కోయడంతో తీవ్ర రక్తస్రావమై చిన్నారి అక్కడికక్కడే మృతి చెందింది. కళ్ల ముందే కూతురు విగతజీవిగా మారడంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.