హైదరాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. మెట్రో పిల్లర్‌ను ఢీ కొట్టిన బైక్.. అక్కడికక్కడే ఇద్దరు మృతి..

3 months ago 7
హైదరాబాద్, సరూర్ నగర్ పరిధిలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మరణించారు. విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టేషన్ సమీపంలో.. అతివేగంతో వస్తున్న ద్విచక్రవాహనం అదుపుతప్పి నేరుగా మెట్రో పిల్లర్‌ను ఢీకొట్టింది. మృతులను మధు, హరీశ్ లుగా పోలీసులు గుర్తించారు. ప్రమాద దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఆ సమయంలో వారు మద్యం సేవించి ఉన్నారా.. అతివేగం ప్రమాదానికి కారణమా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Read Entire Article