TTD Laddu Prasadam in Hyderabad: హైదరాబాద్‌లో ఉన్న శ్రీవారి భక్తులకు టీటీడీ తీపికబురు వినిపించింది. ఇప్పటివరకు కేవలం శని, ఆదివారాల్లో మాత్రమే శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని అందుబాటులో ఉంచుతుండగా.. ఇప్పుడు ప్రతిరోజూ విక్రయించాలని టీటీడీ నిర్ణయించింది. ఈ మేరకు.. నగరంలోని హిమాయత్‌నగర్, జూబ్లీహిల్స్‌లోని టీటీడీ ఆలయాల్లో ఇకపై ప్రతిరోజూ లడ్డూలు విక్రయించనున్నట్టు టీటీడీ ప్రకటించింది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ లడ్డూలు విక్రయించనున్నారు.