వేసవికాలం పూర్తిగా ప్రారంభమవ్వక ముందే హైదరాబాద్‌లో నీటి కష్టాలు మొదలయ్యాయి. నగరంలోని పలు ప్రాంతాల్లో సుమారు 30 గంటలుగా నీటి సరఫరా నిలిచిపోయింది. బీహెచ్ఈఎల్ జంక్షన్ దగ్గర పీఎస్సీ పైప్ లైన్ రిపేర్ కారణంగా.. 12 గంటల పాటు నీటి సరఫరా నిలిపేస్తామని ముందుగా ప్రకటించిన అధికారులు.. నిర్ణీత సమయంలో పనులు పూర్తి కాకపోవటంతో.. ఇప్పటికీ ఇంకా నీటి సరఫరాను పునరుద్ధరించలేదు. దీంతో.. ఆయా ప్రాంతాల్లోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. అందులోనూ సెలవు దినం కావటంతో.. స్థానికులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.